: ఝాన్సీ కోరుకున్నట్టే విడాకులు ఇచ్చేశా: నటుడు జోగి నాయుడు
ఇటు టీవీ రంగం, అటు సినిమా రంగం... రెండింటిలో పేరు తెచ్చుకున్న వారు ఝాన్సీ, జోగినాయుడు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి పదేళ్ల పాప కూడా ఉంది. ఆనందంగా వీరి జీవితం కొనసాగుతున్న సమయంలో... ఏడేళ్ల క్రితం వీరిద్దరికీ అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఇవి రోజురోజుకూ పెద్దవయ్యాయి. కలసి ఉండలేని పరిస్థితుల్లో విడాకులకు అప్లై చేశారు. ఈ నేపథ్యంలో, గత నెల (మే)లో తమకు విడాకులు మంజూరయ్యాయని జోగి నాయుడు తెలిపారు. తన కూతురు ధన్య ప్రస్తుతం వాళ్ల అమ్మ (ఝాన్సీ) దగ్గరే ఉంటోందని... కూతుర్ని చూడ్డానికి కూడా ఝాన్సీ తనను అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రిగా కూతురిపై తనకున్న హక్కును సాధించుకోవడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పారు.