: నా నిర్ణయాలు ప్రజలకు రుచించకపోవచ్చు...దేశానికి మంచి చేస్తాయి: మోడీ
దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో తాను తీసుకునే కొన్ని నిర్ణయాలు ప్రజలకు రుచించకపోవచ్చని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. గోవాలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశం ఆర్థికంగా చాలా సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని ఆయన స్పష్టం చేశారు. తనను పొగడడం వల్ల పార్టీకి ఒరిగే లాభమేదీ లేదని, పార్టీని పటిష్ఠ పరిచే చర్యలు తీసుకుంటే తాను మరింత సంతోషిస్తానని మోడీ తెలిపారు.