: ఏపీ ఐటీ సలహాదారుగా జె.సత్యనారాయణ నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఈ-గవర్నెన్స్ విభాగాలకు ప్రభుత్వ సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జె.సత్యనారాయణను నియమించారు. ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. కేంద్ర సర్వీసుల నుంచి సత్యనారాయణ ఇటీవలే రిటైర్ అయ్యారు.