: నివాస గ్రహాల అన్వేషణకు కొత్త ఉపగ్రహం


అచ్చం భూమిలాగే నివాసయోగ్యమైన గ్రహాలు ఈ పాలపుంతలోగాని, యావత్తు అంతరిక్షంలోగానీ ఎన్ని ఉన్నాయ్‌? ఈలెక్క ఇప్పటిదాకా తేలలేదు. అయితే త్వరలో తేలిపోయినా ఆశ్చర్యం లేదు. కేవలం నివాసయోగ్య గ్రహాలను కనిపెట్టే ప్రయత్నంలో భాగంగా.. అంతరిక్షం అంతా చుట్టి రావడానికి అమెరికా వారి అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఒక ప్రత్యేకమైన ఉపగ్రహాన్ని రూపొందించనుంది. టెస్‌ (టీఈఎస్‌ఎస్‌) అనే ఈ ఉపగ్రహాన్ని 2017లో ప్రయోగించాలని అనుకుంటున్నారు. దీనికోసం దాదాపు 1100 కోట్లు వెచ్చించబోతున్నారు. గతంలో ఇతర గ్రహాల అన్వేషణకు సాగిన ప్రయోగాల కంటె ఇది 400 రెట్లు అధికశక్తితో పనిచేస్తుందని ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న జార్జ్‌ రికర్‌ తెలిపారు. దీని ద్వారా గ్రహాల మీది గల ద్రవ్యరాశి, సాంద్రత, వాతావరణం అన్నీ తెలుస్తాయని వారు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News