: కొత్త మద్యం పాలసీని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం


తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రకటించింది. జూలై ఒకటో తేదీ నుంచి జూన్ 2015 వరకు కొత్త మద్యం విధానాన్ని రూపొందించారు. ఫిక్స్ డ్ లైసెన్స్ విధానంలో మద్యం షాపులను కేటాయించాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 2,216 షాపులను కేటాయించనున్నారు. 2011 జనాభా ప్రాతిపదికన డ్రా పద్ధతిలో షాపులను కేటాయిస్తారు.

10 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతానికి రూ. 32.50 లక్షలను లైసెన్స్ ఫీజుగా నిర్ణయించారు. 10 నుంచి 50 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతానికి రూ. 34 లక్షలు, 50 వేల నుంచి 3 లక్షలు వరకు జనాభా ఉంటే రూ. 42 లక్షలు లైసెన్స్ ఫీజుగా నిర్ణయించారు. 3 నుంచి 5 లక్షలు జనాభా ఉన్న ప్రాంతానికి రూ. 50 లక్షలు, 5 నుంచి 20 లక్షల వరకు జనాభా ఉన్న ప్రాంతానికి రూ. 65 లక్షలు లైసెన్స్ ఫీజుగా చెల్లించాలి. ఇక, జనాభా 20 లక్షలు దాటితే లైసెన్స్ ఫీజు కింద రూ. 90 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News