: జూన్ 20లోపు అణు ఒప్పందం ఖరారు చేసుకుంటాం: ఇరాన్ అధ్యక్షుడు
పశ్చిమ దేశాలతో అణు ఒప్పందం సాధ్యమేనంటూ ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ స్పష్టం చేశారు. ఇది ఒక ఆదర్శప్రాయమైన ఒప్పందం అవుతుందని అన్నారు. జూలై 20లోపు ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటామన్న ధీమా వ్యక్తం చేశారు. దేశ అవసరాల నేపథ్యంలో అణు ఒప్పందం చాలా ముఖ్యమని చెప్పారు. ఇప్పటి వరకు అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, చైనాలు ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నాయి.