: సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చాల్సిన బాధ్యత మీదే: అధికారులతో అశోక్ గజపతిరాజు
అధికారులు సమన్వయంతో పనిచేసి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. విజయనగరం జిల్లా ప్రజలకు అన్ని విధాలా మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని మాట్లాడుతూ... విజయనగరం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు తమ వంతు కృషి చేస్తానని అన్నారు.