: టీస్టాల్ లో గ్యాస్ లీకై చెలరేగిన మంటలు


హైదరాబాదులోని ఓ టీస్టాల్ లో సిలిండర్ నుంచి గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు సిలిండర్ కనెక్షన్ తొలగించడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటన చైతన్యపురి పీఎస్ పరిధిలోని ఆర్కేపురం డివిజన్ రోడ్డు నెం. 3లోని ఓ టీస్టాల్ లో జరిగింది. గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో పక్కనే ఉన్న బేకరి, స్టేషనరీ షాపులకు మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కల ఉన్నవారు హుటాహుటిన వచ్చి మంటలు అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది.

  • Loading...

More Telugu News