: జూనియర్ డాక్టర్లు పల్లెల్లో పనిచేయాల్సిందే: రాజయ్య


జూనియర్ డాక్టర్లు గ్రామాల్లో పనిచేసే విషయంలో ఎలాంటి అపోహలు అక్కర్లేదని, ఏడాది పాటు పనిచేయాల్సిందేనని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.రాజయ్య అన్నారు. ప్రైవేటు మెడికల్ కళాశాలల ప్రత్యేక ప్రవేశ పరీక్ష విషయంలో త్వరలోనే కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాదు రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత ప్రభుత్వ పాలసీలు ఎలా ఉన్నా, వాటిపై సమీక్షించి త్వరలోనే కేబినెట్ లో తగిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. బీబీనగర్ నిమ్స్ ఆసుపత్రి విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, అక్కడున్న సమస్యలను అధిగమించి త్వరలోనే ఆసుపత్రిని ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి, ఏపీ సాక్స్ పీడీ సువర్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News