: చంద్రబాబుతో ముగిసిన శివరామకృష్ణన్ కమిటీ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఏపీ రాజధానిపై ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో రాజధాని అంశాలపై బాబుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఉన్న పట్టణాల్లో ఒకదాన్ని అభివృద్ధి చేయడమా? లేదా స్థల సేకరణ చేయడమా? అనే అంశంపై ప్రధానంగా చర్చించారు. కాగా, వచ్చే నెలలో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు.