: కాంగ్రెస్ పని అయిపోయింది...పిల్ల కాంగ్రెస్ కూడా ఖతమవుతుంది: వర్ల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ ప్రభుత్వానికి ప్రతిపక్షం ఉండదని టీడీపీ నేత వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ పార్టీ మట్టికొట్టుకుపోయిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఇక బతికి బట్టకట్టే పరిస్థితి లేదని, ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఏ రూపంలోనూ అంగీకరించే పరిస్థితి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక పిల్ల కాంగ్రెస్ (వైఎస్సార్సీపీ) కూడా ఖతమైపోతుందని ఆయన అన్నారు.
వైఎస్సార్సీపీ అసలు స్వరూపం తెలుసుకున్న ప్రజలు అధికారం ఇవ్వకుండా అడ్డుకున్నారని ఆయన తెలిపారు. త్వరలోనే ఆ పార్టీ కూడా దుకాణం మూసేస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఏతావాతా ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం లేకుండా పోతుందని ఆయన అన్నారు.