: టీవీ9, ఆంధ్రజ్యోతిపై ఏకగ్రీవ తీర్మానం
తెలంగాణ శాసనసభ గౌరవాన్ని కించపరిచే విధంగా ప్రసారాలు చేసిన టీవీ9, ఆంధ్రజ్యోతి పత్రికపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న నిర్ణయాన్ని స్పీకర్, మండలి ఛైర్మన్లకు తెలంగాణ ప్రజా ప్రతినిధులు అప్పగించారు. అందుబాటులో ఉన్న చట్టాలని పరిశీలించి చర్యలు తీసుకోవాలంటూ ప్రజాప్రతినిధులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. కాగా, టీవీ9 ప్రసారాలపై మండిపడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రజ్యోతి పని గట్టుకుని తెలంగాణ ప్రభుత్వాన్ని నెగిటివ్ గా చూపిస్తోందని ఆరోపించిన సంగతి తెలిసిందే.