: స్పెయిన్ పై ప్రతీకారం తీర్చుకున్న నెదర్లాండ్స్


గత ప్రపంచ కప్ టైటిల్ పోరులో ఎదురైన పరాభవానికి నెదర్లాండ్స్ ప్రతీకారం తీర్చుకుంది. స్పెయిన్ పై తిరుగులేని ఆధిక్యం సాధించి సత్తా చాటింది. ఎన్నో అంచనాలతో బరిలో దిగిన స్పెయిన్ విశ్లేషకులు, అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. పెర్సీ, రాబిన్ ల ధాటికి స్పెయిన్ ఊహించని పరాజయాన్ని మూటగట్టుకుంది. మ్యాచ్ ఫేవరేట్ గా బరిలోదిగిన స్పెయిన్ అందరి అంచనాలను నిజం చేస్తూ తొలి అర్ధభాగంలోనే గోల్ సాధించింది.

దీంతో స్పెయిన్ దే విజయం అన్నంతగా ఆ జట్టు అభిమానులు స్టేడియంలో సంబరాలు చేసుకున్నారు. 27వ నిమిషంలో స్పెయిన్ స్టార్ ఆటగాడు అలాన్సో తొలి గోల్ చేసి స్పెయిన్ కు అధిక్యం అందించాడు. మ్యాచ్ లో ఎక్కువ సేపు బంతిని తన నియంత్రణలో ఉంచుకున్న స్పెయిన్ జట్టు నెదర్లాండ్స్ ఆటగాళ్ల దూకుడుకు అడ్డుకట్ట వేయలేకపోయారు. మ్యాచ్ 44వ నిమిషంలో నెదర్లాండ్స్ స్టార్ ప్లేయర్ పెర్సీ తొలి గోల్ చేసి స్కోరు సమం చేశాడు.

అనంతరం రాబెన్ 53వ, 80వ నిమిషంలో వరుసగా రెండు గోల్స్ చేయడంతో నెదర్లాండ్స్ ఆధిక్యం సాధించింది. 65వ నిమిషంలో వ్రిజ్ గోల్ చేయగా, 73వ నిమిషంలో పెర్సీ మరోసారి గోల్ చేయడంతో 5-1 తేడాతో నెదర్లాండ్స్ విజయం సాధించింది.

  • Loading...

More Telugu News