: పాకిస్థాన్ లో మరోసారి భూకంపం
పాకిస్థాన్ లోని వాయవ్య ప్రాంతంలోని పెషావర్ పరిసర ప్రాంతాల్లో ఈ ఉదయం మధ్య స్థాయి భూకంపం ప్రజలను వణికించింది. భూకంప కేంద్రం అఫ్ఘనిస్థాన్ లోని హిందూకుష్ పర్వత ప్రాంతంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.6గా నమోదైంది. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. నిన్న ఉదయం బలూచిస్థాన్ ప్రాంతంలో స్వల్ప భూకంపం వచ్చిన 24 గంటల్లోనే మరో ప్రాంతంలో భూకంపం రావడం గమనార్హం.