: ఆ ముగ్గురు చిన్నారులు అడవిలోకి వెళ్లారేమో?
మెదక్ జిల్లాలోని జిన్నారం మండలంలో ముగ్గురు చిన్నారులు ఆడుకునేందుకు వెళ్లి అదృశ్యమై పోయారు. బొంతపల్లి గ్రామ సమీపంలోని వీరన్నగూడెంలో ఈ ఘటన జరిగింది. పిల్లల జాడ తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మాసానిపేటకు చెందిన ఎల్లమ్మ, యాదగిరిలు తమ కుమారులు నవీన్ కుమార్ (11), జోగినాథ్ (8)లతో కలిసి, అదే గ్రామానికి చెందిన శకుంతల, ఆంజనేయ గౌడ్ తమ కుమారుడు నాగరాజు (8)తో కలిసి బతుకుదెరువు కోసం జిన్నారం మండలానికి వచ్చారు. తల్లిదండ్రులు కూలీ పని కోసం బయటకు వెళ్లగా, ఇంటి వద్దనున్న చిన్నారులు ఆడుకునేందుకు వెళ్లి కనిపించకుండా పోయారు. సమీపంలోనే అటవీ ప్రాంతం ఉండటంతో అందులోకి వెళ్లి తప్పిపోయి ఉంటారని గ్రామస్థులు అనుమానిస్తున్నారు.