: పాదరసానికి, చక్కెర వ్యాధికి లింకు
పాదరసం అంటే థర్మామీటరులో కనిపించే ద్రవరూపంలోని ఘనపదార్థంగా మాత్రమే మనకు తెలుసు. చేపలు షెల్‌చేపలు అధికంగా తినడం వల్ల మనుషుల శరీరంలోకి పాదరసం చేరుతుందనే సంగతి మనలో చాలా మందికి తెలియదు. అయితే పాదరసం కింద పడిందంటే.. ఎక్కడా నిలకడగా ఉండకుండా ద్రవరూపంలో అలా జారిపోతూ ఉంటుందనే సంగతి కూడా చాలా మందికి తెలుసు.
ఇప్పుడు అలాంటి పాదరసానికి, చక్కెర వ్యాధికి లింకుందని శాస్త్రవేత్తలు నిగ్గు తేల్చారు. పిల్లలపై పాదరసం ప్రభావం ఎక్కువైతే వారికి టైప్ 2 మధుమేహం వస్తుందని అంటున్నారు. ఈ ముప్పు .. వారి తర్వాతి జీవితకాలంలో 65 శాతం వరకు పెరుగుతుందని ఇండియానా యూనివర్సిటీ శాస్త్రవేత్త కాహే తెలిపారు.