: ఈ నౌకలో నెలరోజులకు లక్ష కోడి గుడ్లు కావాలి


ప్రధాని మోడీ ఈ రోజు జాతికి అంకితం చేసిన ఐఎన్ఎస్ విక్రమాదిత్య నౌక గురించి చెప్పుకోవడానికి కొన్ని విశేషాలు ఉన్నాయి. 44,500 టన్నుల బరువుండే ఈ నౌకను నీటిపై తేలే ఓ చిన్నపాటి పట్టణంగా చెప్పవచ్చు. దీని పొడవు 284 మీటర్లు. మూడు ఫుట్ బాల్ మైదానాలను కలిపితే ఎంత ఉంటుందో ఈ నౌక కూడా అంతే విస్తీర్ణంతో ఉంటుంది. ఇది 20 అంతస్తులంత ఎత్తు ఉంటుంది. 1,600మందికి పైగా నౌకాదళ సిబ్బంది ఇందులో ప్రయాణించవచ్చు. ఒక నెల రోజుల ప్రయాణంలో వీరి కోసం లక్ష కోడిగుడ్లు, 20 వేల లీటర్ల పాలు, 16 టన్నుల బియ్యం అవసరం అవుతాయి.

  • Loading...

More Telugu News