: నానో డిమాండ్ పూర్... సనంద్ ప్లాంట్ మూసివేత
రతన్ టాటా కలల ఉత్పాదన నానో కారుకు ప్రజల నుంచి డిమాండ్ తగ్గిపోయింది. ఆటోకు ఎక్కువ, కారుకు తక్కువ అన్నట్లుగా ఉండే ఈ నాలుగు చక్రాల వాహనానికి ప్రజల్లో ఆదరణ లేకపోవడం, అమ్మకాలు ఆశాజనకంగా లేకపోవడంతో గుజరాత్ లోని సనంద్ ప్లాంట్ ను కంపెనీ తాత్కాలికంగా మూసివేయనుంది. 35 నుంచి 40 రోజుల తర్వాత తిరిగి తెరవనుంది. అయితే, కొత్త వెర్షన్ తయారీకి అనుగుణంగా తగిన మార్పులు చేయడానికే ప్లాంట్ ను మూసివేసినట్లు టాటా కంపెనీ చెబుతోంది. వాస్తవానికి గత ఆరు నెలలుగా సనంద్ ప్లాంట్ ను కంపెనీ వారంలో రెండు మూడు రోజులే నడిపిస్తోంది.