: ముక్కు ఒక్కటే గొప్ప కాదు!
వాసన పీల్చే విషయంలో ముక్కులేకపోతే.. మనం ఎన్ని అనుభూతులను మిస్ అయిపోతామేమో కదా అని ఎపుడైనా అనిపించిందా? వాసన పసిగట్టే శక్తి ముక్కుకు మాత్రమే ఉంటుందని, ఆఘ్రాణించే గ్రంథులు ముక్కుకే పరిమితమని మనం చదువుకున్న రోజుల్లోని సైన్సు మారిపోబోతోంది. తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించిన వివరాల ప్రకారం.. వాసనను గుర్తించే ముక్కులోని ఓల్‌ఫ్యాక్టరీ రిసెప్టర్లు.. శరీరంలోని రక్తం, గుండె, ఊపిరితిత్తుల్లో కూడా ఉంటాయిట. ఇతర కణాలకు కూడా ఈ శక్తి ఉంటుంది. ఈ విషయాన్ని జర్మనీలోని మ్యూనిక్ యూనివర్సిటీ శాస్త్రవేత్త పీటర్ షీబర్లే వివరించారు.