: ప్రపంచంలో మరెక్కడా ఇలా జరగట్లేదు... అమెరికా సిగ్గుపడాలి: ఒబామా
అమెరికా పాఠశాలల్లో కాల్పులు జరుగుతున్న సంఘటనలపై ఆ దేశాధ్యక్షుడు ఒబామా ఘాటుగా స్పందించారు. ఇలాంటి ఘటనలు ప్రపంచంలో మరెక్కడా జరగడం లేదని... కేవలం అమెరికాలోనే జరుగుతున్నాయని... మనం సిగ్గుపడాలని దేశప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అమెరికాలో 18 నెలల కాలవ్యవధిలో ఏకంగా 74 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలని ఒబామా అన్నారు. సమాజానికి నష్టం కలిగించే వ్యక్తుల చేతుల నుంచి తుపాకులను దూరం చేయడానికి కొన్ని చర్యలను చేపట్టాలని... అయితే సమాజం మాత్రం దీనికి సుముఖంగా లేదన్నదే తన బాధ అని చెప్పారు. తుపాకుల లైసెన్సింగ్ విధానాన్ని నియంత్రిద్దామంటే అనేక శక్తులు దానికి అడ్డుపడుతున్నాయని తెలిపారు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ అంటే కాంగ్రెస్ లోని అనేక మంది సభ్యులకు కూడా భయమని ఎద్దేవా చేశారు.