: 26న పీఎస్ఎల్వీ ప్రయోగం... 52 గంటల కౌంట్ డౌన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ నెల 26వ తేదీన ఉదయం 9.50 గంటలకు పీఎస్ఎల్వీ- సీ23ను ప్రయోగించనుంది. దీనికి సంబంధించి ఈ నెల 24న కౌంట్ డౌన్ మొదలవుతుంది. ఈ ప్రయోగంతో ఫ్రాన్స్ కు చెందిన స్పాట్-7 అనే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ సహా మరో నాలుగు ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి పంపనుంది.