: ఏపీ రాజధానికి మార్కెఫెడ్ ఉద్యోగుల విరాళం
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి మార్కెఫెడ్ ఉద్యోగుల సంఘం రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించింది. మార్కెఫెడ్ తరపున ఛైర్మన్ కంచె రామారావు ఆధ్వర్యంలో పలువురు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి రూ.10 లక్షల చెక్ ను అందించారు. కాగా, విశాలాంధ్ర ఏర్పాటు నిమిత్తం అప్పట్లో తన ముఖ్యమంత్రి పదవి వదులుకున్న తెలంగాణా నాయకుడు బూర్గుల రామకృష్ణారావు కుమారుడు లక్ష్మీనారాయణ, ఆయన భార్య సంధ్య బాబును కలసి ఏపీ రాజధాని నిర్మాణానికి లక్ష రూపాయల విరాళాన్ని అందించారు.