: సినీనటి కేసు వెనుక కారణం!
సొట్టబుగ్గల నటి ప్రీతిజింటా మాజీ ప్రియుడు నెస్ వాడియాపై కేసు పెట్టడం సంచలనం కలిగిస్తోంది. తనను ముంబైలోని వాంఖడే స్టేడియంలో గత నెల 30న ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా వేధించాడంటూ ఆమె తాజాగా కేసు నమోదు చేయడం వెనుక అసలు కారణం వేరే ఉందంటున్నారు. నెస్ వాడియా మరో మహిళకు దగ్గర కావడమే. వాడియా యూఏఈలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా తన కొత్త ప్రియురాలితో సన్నిహితంగా మెలగడాన్ని ప్రీతి తట్టుకోలేకపోయిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో గత నెల 30న జరిగిన మ్యాచ్ సందర్భంగా వీరిద్దరి మధ్య వాదన జరిగినట్లు తెలుస్తోంది. ప్రీతిజింటా, నెస్ వాడియా ఇద్దరూ కింగ్స్ 11 పంజాబ్ జట్టు సహ యజమానులు.