: మాజీ ప్రియుడిపై ప్రీతిజింటా కేసు


బాలీవుడ్ నటి ప్రీతిజింటా (39) తన మాజీ ప్రియుడు, వ్యాపారవేత్త నెస్ వాడియా(44)పై కేసు పెట్టింది. ప్రీతిజింటా ఐపీఎల్ కింగ్ 11 పంజాబ్ జట్టు సహ యజమాని అన్న విషయం తెలిసిందే. గత నెల 30న కింగ్స్ లెవెన్ పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా నెస్ వాడియా తనను లైంగికంగా వేధించాడని, అసభ్యకరంగా ప్రవర్తించాడని, బెదిరించాడని ప్రీతి ముంబై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

దీంతో వాడియాపై పలు సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రీతిజింటా, నెస్ వాడియా గతంలో ఐదేళ్ల పాటు ప్రేమించుకుని విడిపోయిన విషయం తెలిసిందే. అయితే, ప్రీతిజింటా ఆరోపణలు ఆధారరహితమని నెస్ వాడియా స్పష్టం చేశారు. ఆమె చుట్టూ బౌన్సర్లు (రక్షకులు) ఉండగా తాను ఆమెను వేధించడం సాధ్యంకాని పనిగా చెప్పారు.

  • Loading...

More Telugu News