: తిరుమల క్యూ కాంప్లెక్స్ నుంచి దూకి ఒక హాకర్ మృతి


తిరుమల క్యూ కాంప్లెక్స్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి దూకి ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే, గజేంద్ర అనే హాకర్ మరికొంతమంది హాకర్స్ తో కలసి అనుమతులు లేకుండా క్యూ కాంప్లెక్స్ లో వ్యాపారం (తినుబండారాలు వగైరా) నిర్వహిస్తున్నాడు. ఈ ఉదయం క్యూ కాంప్లెక్స్ లపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఈ దాడులతో హాకర్లు చెల్లాచెదురయ్యారు. విజిలెన్స్ అధికారుల భయంతో గజేంద్ర కిందకు దూకాడు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని స్వస్థలం చిత్తూరు జిల్లా రామకుప్పం.

  • Loading...

More Telugu News