: సినీ నటి తెలంగాణ శకుంతల(63) గుండెపోటుతో మృతి


సినీ నటి తెలంగాణ శకుంతల (63) నిన్న అర్ధరాత్రి దాటిన తరువాత మృతి చెందారు. హైదరాబాద్ శివారు కొంపల్లిలోని తన నివాసంలో ఆమెకు గుండెపోటు రావడంతో వెంటనే సురారంలోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. క్యారెక్టర్ నటిగా పలు చిత్రాల్లో విలక్షణ పాత్రలు పోషించిన శకుంతల తెలంగాణ యాసతో పేరొందారు. 1981లో 'మా భూమి' చిత్రం ద్వారా ఆమె సినీరంగ ప్రవేశం చేయగా, 'గులాబీ' చిత్రంతో నటిగా గుర్తింపు పొందింది. మొత్తం 70కి పైగా చిత్రాల్లో నటించిన ఆమెకు 'నువ్వు-నేను','ఒక్కడు' 'లక్ష్మీ' చిత్రాల్లో పోషించిన పాత్రలకు మంచి ఆదరణ లభించింది. హాస్యనటిగా కూడా ఆమె మంచి గుర్తింపు పొందారు. మహారాష్ట్రలో జన్మించిన ఆమెకు ఇద్దరు సంతానం ఉన్నారు.

  • Loading...

More Telugu News