: సత్తెనపల్లిలో తగులబడుతున్న సెల్ టవర్
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని బోయ కాలనీలో సెల్ టవర్ తగులబడుతోంది. ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు.