కాశ్మీరులోని కిష్టావర్, దోడా జిల్లాల్లో ఇవాళ స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.0గా నమోదైంది. దోడా జిల్లాకు 19 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు.