: అనంతపురాన్ని ఏపీకి ఉపరాజధానిగా ప్రకటించాలి: సీపీఐ
రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ లో ఉపరాజధాని కోసం పోరు ప్రారంభమైంది. అనంతపురాన్ని ఉపరాజధానిగా ప్రకటించాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. అనంతపురంలో జిల్లా సీపీఐ నేతలు మాట్లాడుతూ, గుంటూరు-విజయవాడ జిల్లాల్లో రాజధాని ఏర్పడే అవకాశాలు ఉన్నందున, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే అనంతపురాన్ని ఉపరాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కదిరి, గోరుంట్ల, నల్లమాడ్, పుట్టపర్తి ప్రాంతాన్ని పారిశ్రామిక కారిడార్ గా మార్చాలని సూచించారు. పరిశ్రమలు నెలకొల్పితే భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని సీపీఐ నేతలు తెలిపారు.