: 50 యేళ్లు పూర్తి చేసుకున్న ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
హైదరాబాదు శివారు రాజేంద్రనగర్లోని ప్రతిష్ఠాత్మక ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ విద్య, విస్తరణ, పరిశోధన రంగాల్లో ప్రపంచ వ్యాప్త గుర్తింపును పొందింది. అర్థ శతాబ్దాన్ని పూర్తి చేసుకుని ఈ వర్శిటీ ఇప్పుడు మరో మైలురాయిని అధిగమించింది. ఈ సందర్భంగా ఇవాళ రాజేంద్రనగర్ లో వర్శిటీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 1964 జూన్ 12న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా ఏర్పడిన ఈ వ్యవసాయ విద్యాకేంద్రం మూడు కళాశాలలతో ప్రారంభమైంది. ప్రస్తుతం 15 కళాశాలలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాల స్థాయికి ఎదిగింది.