: తప్పు చేయలేదంటోన్న చేవెళ్ళ చెల్లెమ్మ!
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మంత్రులుగా పనిచేసిన పలువురు ఇప్పుడు నిందితుల జాబితాకెక్కడంలో వింతేముంది. మొన్న మోపిదేవి, నిన్న ధర్మాన, నేడు సబిత.. ఇలా సాగుతోంది వరుస. గనుల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో పలు ఫైళ్ళపై సంతకాలు చేసి కొందరికి లబ్ది చేకూర్చేలా వ్యవహరించారని సీబీఐ.. సబితపై ఛార్జిషీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే తాను నిబంధనలకు లోబడే సంతకాలు చేశానని సబిత చెబుతున్నారు. ఈ సాయంత్రం తనను కలిసిన బొత్స, ఆనంలతో సబిత ఇదే విషయం చెప్పినట్టు తెలుస్తోంది. ఓ దశలో ఆమె రాజీనామాకు సిద్ధపడినట్టు సమాచారం. అయితే బొత్స, ఆనం సూచనమేరకు ఆమె ముఖ్యమంత్రిని కలవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం క్యాంపు కార్యాలయంలో సబిత.. సీఎంతో భేటీ అయ్యారు.