: సిన్సియర్ గా పనిచేస్తా: మంత్రి అచ్చెన్నాయుడు
తనపై నమ్మకం ఉంచి చంద్రబాబు మంత్రి పదవి అప్పగించారని, దానిని నిలబెట్టుకునేలా సిన్సియర్ గా పనిచేస్తానని కింజెరపు అచ్చెన్నాయుడు అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన తొలిసారిగా శ్రీకాకుళం జిల్లాకు విచ్చేశారు. ఆయనకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. శ్రీకాకుళంలోని సింహద్వారం వద్దనున్న ఎర్రన్నాయుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలోని అనేక పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. వాటిని పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని అచ్చెన్నాయుడు అన్నారు.