: రాజ్యసభ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల
రాజ్యసభ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ క్రమంలో ఈ నెల 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 24న వాటిని పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 26 వరకు గడువు విధించారు. ఇక వచ్చేనెల 3న ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుంది. తర్వాత ఐదు గంటలకు కౌంటింగ్ నిర్వహిస్తారు. నేదురుమల్లి జనార్ధనరెడ్డి మృతితో ఏపీ నుంచి ఓ రాజ్యసభ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే.