: ట్విట్టర్ కు ఆ ఇద్దరు గుడ్ బై చెప్పేశారు


ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ మీడియా ట్విట్టర్ సంస్థకు ఇద్దరు సీనియర్ ఉద్యోగులు గుడ్ బై చెప్పేశారు. సీవోవో అలీ రౌగానీ, మీడియా హెడ్ స్లాడెన్ రాజీనామా చేసినట్లు ట్విట్టర్ వెల్లడించింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డిక్ కాస్టోలోతో చిన్నపాటి వివాదమే సీవోవో రాజీనామాకు కారణమని ఆయన సన్నిహితులు చెప్పారు. ముందుగా అలీ ట్విట్టర్ లో రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. కొద్ది గంటల తర్వాత మీడియా హెడ్ స్లాడెడ్ కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

  • Loading...

More Telugu News