: అది బంధం... అత్యాచారం కాదు: ఢిల్లీ కోర్టు
భార్యాభర్తల మధ్య భౌతికపరమైన సంబంధాలను అత్యాచారంగా పరిగణించలేమని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. కోర్టు ముందుకు వచ్చిన వ్యాజ్యంలో ఫిర్యాదు దారు (భార్య)ని, నిందితుడు (భర్త) రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందు తన ఇంట్లో అద్దెకు ఉన్న సమయంలో మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడని ఆ మహిళ ఆరోపించింది. మరుసటి రోజు ఆమెను తీసుకువెళ్లి వివాహం చేసుకున్నాడని తెలిపింది. పెళ్లి తరువాత పలు మార్లు తన భర్త తనపై అత్యాచారం చేశాడంటూ ఆమె కేసు పెట్టింది. దీంతో ఈ కేసును విచారించిన జడ్జి వీరేందర్ భట్... మహిళ అనుమతి లేకున్నా భార్యాభర్తల మధ్య సంబంధాలను అత్యాచారంగా పరిగణించలేమని స్పష్టం చేశారు.