: రాష్ట్ర విభజనతో 'వెల్ కమ్' (వెలమ, కమ్మ) గ్రూపు లాభపడింది: రేవంత్ రెడ్డి


అసెంబ్లీ లాబీలో తెలంగాణ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన వల్ల 'వెల్ కమ్' గ్రూపుకు లబ్ధి చేకూరిందని... 'వెల్ కమ్' గ్రూపు అంటే తెలంగాణలో వెలమ, సీమాంధ్రలో కమ్మ అని అర్థమని చెప్పారు. ఈ పరిస్థితుల్లో, తమ రెడ్డి సామాజిక వర్గం పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మొదటి నుంచి పరిపాలనలో కీలకపాత్ర పోషించింది రెడ్లే అని... అధికారం లేకపోతే తాము ఉండలేమని అన్నారు. జైపాల్ రెడ్డి, జానారెడ్డిలాంటి వారు అధికారం లేకుండా ఎంతకాలం ఉండగలరని ప్రశ్నించారు. "నా లక్ష్యమైతే 2019లో సీఎం కూర్చీ ఎక్కడమే. మిగతావారు ఏ పదవులు కోరుకున్నా సరే... నాకు మాత్రం సీఎం సీటు చాలు" అంటూ మీడియాతో వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News