: ఏపీ ఉద్యోగుల జీతాలకు ఈ నెల ఇబ్బంది లేదు: మంత్రి యనమల


రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువగా లోటు బడ్జెట్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో కొన్నాళ్ల వరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా కష్టమే. అయితే, ఈ నెల ఉద్యోగుల జీతాలకు ఎలాంటి ఇబ్బంది లేదని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లాలో మాట్లాడిన ఆయన, రాజమండ్రి ఎయిర్ పోర్టును విస్తరించి కాకినాడ పోర్టుకు అనుసంధానం చేస్తామన్నారు. విశాఖ-కాకినాడ మధ్య అంతర్జాతీయ విమానాశ్రయానికి కృషి చేస్తామని చెప్పారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు 6 లేదా 8 లైన్ల రోడ్, 13 జిల్లాల్లో రైల్వే ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News