: 'రేవ్ పార్టీ' కేసులో లొంగిపోయిన సఫారీ క్రికెటర్


ముంబయి రేవ్ పార్టీ కేసులో దక్షిణాఫ్రికా పేసర్ వేన్ పార్నెల్ నేడు ముంబయి కోర్టులో లొంగిపోయాడు. 2012 ఐపీఎల్ సందర్భంగా పార్నెల్, భారత లెగ్ స్పిన్నర్ రాహుల్ శర్మ తదితరులతో కలిసి ఓ రేవ్ పార్టీలో మాదకద్రవ్యాలు స్వీకరించినట్టు నిర్ధారణ అయింది. అయితే, పార్నెల్ అప్పట్లో వెంటనే దక్షిణాఫ్రికా వెళ్లిపోయాడు. దీంతో, కేంద్రం వాంటెడ్ లిస్టులో పార్నెల్ పేరునూ చేర్చింది.

ఈ నేపథ్యంలో పార్నెల్ నేడు ప్రత్యేక కోర్టు ముందర హాజరయ్యాడు. అనంతరం కోర్టు అతనికి 10 వేల రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన పార్నెల్ ఐపీఎల్ లో పుణే వారియర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం బెయిల్ లభించినా బీసీసీఐ క్లియరెన్స్ ఇస్తేనే పార్నెల్ తాజా ఐపీఎల్ సీజన్లో పాల్గొంటాడు.

  • Loading...

More Telugu News