: విశాఖ జిల్లాలో వడగాలులకు ముగ్గురు మృతి
విశాఖ జిల్లాలో ఇవాళ కూడా వడగాలులు వీయడంతో ప్రజలు అల్లాడిపోయారు. నక్కపల్లి మండలంలో వడగాల్పుల ధాటికి ముగ్గురు వృద్ధులు మరణించారు. పెదతీనార్ల గ్రామానికి చెందిన మేరుగు కోదండ, సూరమ్మ, బోయపాడుకు చెందిన అప్పయ్యమ్మలు మృతి చెందారు. మండలంలో గత నాలుగు రోజులుగా వడగాలుల తీవ్రతతో మృతి చెందిన వారి సంఖ్య 12కి చేరింది.