: బాబోయ్ ‘దెయ్యంపిల్ల’ అంటూ భయపడుతున్నారు!
సింగపూర్ వాసులు ఇప్పడు ఆ ‘దెయ్యంపిల్ల’ను చూసి తెగ భయపడుతున్నారు. సింగపూర్ లో రద్దీగా ఉండే ఆ వీధిలోకి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. ఇంతకీ అసలు విషయమేమిటంటే... ఆ వీధిలోని ఓ చెట్టుకు ఆనించి ఉన్న ఓ అమ్మాయి బొమ్మ కళ్లకు కట్టిన వస్త్రం మీద అరబిక్ లో ‘అల్లా’ అని రాసి ఎవరో అక్కడ వదిలేశారు. అయితే ఆ అమ్మాయి బొమ్మలో దెయ్యం ఉందని అక్కడ విపరీతంగా ప్రచారం జరిగింది. అంతే కాదు, ఆ బొమ్మకు చెందిన యజమానురాలు దీనిలోని దెయ్యం తన వెంటపడకుండా, తిరిగి తన వద్దకు రాకుండా ఉండేందుకు దీని కళ్లకు ఇలా వస్త్రం కట్టి వీధిలో వదిలేసిందని కూడా కొంతమంది ట్వీట్ చేశారు. ఎవరైనా పొరపాటున దీని కళ్లకు కట్టిన వస్త్రాన్ని విప్పితే ఆ ‘శాపం’ వాళ్లను వెంటాడుతుందని కూడా ప్రచారం జరుగుతోంది. దాంతో ఇప్పుడు సింగపూర్ లో ఆ ‘దెయ్యం పిల్ల’ ఉదంతం కలకలం రేపుతోంది.