: ముంబయిలో ఎగసిపడుతున్న అలలు, లోతట్టు ప్రాంతాలు జలమయం
ముంబయిలోని అరేబియా తీర ప్రాంతంలో అలలు పోటెత్తుతున్నాయి. గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద నిన్న సాయంత్రం, ఇవాళ ఉదయం భారీ అలలు పోటెత్తగా లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. ఇవాళ్టి నుంచి జూన్ 18వ తేదీ వరకూ తీర ప్రాంతంలో అలలు 4 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తుకు ఎగసిపడతాయని, ప్రజలను సముద్రతీరం వైపు అనుమతించవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నగరమంతటా విపత్తు నివారణ బృందాలను అప్రమత్తం చేశారు.