: 8వ ర్యాంకులో నిలిచిన అశ్విన్
ఐసీసీ టెస్టు క్రికెట్ ర్యాంకింగ్స్ ప్రకటించింది. బౌలర్ల విభాగంలో భారత ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ టాప్ 10లో స్థానం దక్కించుకున్నాడు. గతేడాది 19 టెస్టులాడిన అశ్విన్ 104 వికెట్లు తన ఖాతాలో వేసుకుని 744 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచాడు. 898 పాయింట్లతో సౌతాఫ్రికా ఆటగాడు డేల్ స్టెయిన్ అగ్రస్థానాన్ని దక్కించుకోగా, ద్వితీయ స్థానంలో 870 పాయింట్లతో ఆస్ట్రేలియా ఆటగాడు ర్యాన్ హేరిస్, మూడో స్థానంలో 865 పాయింట్లతో సౌతాఫ్రికాకు చెందిన ఫిలాండర్ నిలిచాడు.
కాగా, అశ్విన్ టెస్టు ఆల్ రౌండర్ల జాబితాలో కూడా స్థానం దక్కించుకున్నాడు. ప్రపంచ ఆల్ రౌండర్లలో నెంబర్ వన్ స్థానాన్ని ఫిలాండర్ దక్కించుకోగా, రెండవ స్థానంలో అశ్విన్ నిలిచాడు.