: లోక్ సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ నుంచే ఉండాలంటున్న తృణమూల్?


లోక్ సభ ఎన్నికలు ముగిసి రెండు నెలలు గడిచినా సభలో ప్రతిపక్ష పార్టీ ఏదనేది ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అయితే, లోక్ సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ నుంచే ఉండాలని తృణమూల్ పార్టీ పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ కు తృణమూల్ మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందట. విషయమేమిటంటే, ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో 545కు స్థానాలకుగానూ కాంగ్రెస్ 44 సీట్లు మాత్రమే దక్కించుకుంది. సభ నిబంధనల ప్రకారం 10 శాతం బలం ఎవరికైతే ఉంటుందో వారే ప్రధాన ప్రతిపక్ష హోదా పొందుతారు. కానీ, ఇక్కడ కాంగ్రెస్ ఆ హోదాను కూడా పొందలేకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News