: బియాస్ నదిలో మరో మృతదేహం లభ్యం


హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం దాదాపు 500 మంది సహాయక బృందాలుగా ఏర్పడి నదిని జల్లెడ పడుతున్నారు. లార్జి డ్యాం నుంచి పండా డ్యాం వరకు ఉన్న 18 కి.మీ. ప్రాంతంలో అన్వేషణ కొనసాగుతోంది. ఇవాళ మరో విద్యార్థి మృతదేహాన్ని సహాయక సిబ్బంది వెలికితీశారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 9 మృతదేహాలను కనుగొన్నారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. రేపు ఉదయం మూడు గంటల పాటు నీటిని మొత్తం నిలిపివేసి సహాయక చర్యలను కొనసాగిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు.

  • Loading...

More Telugu News