: ప్రధాని మోడీతో భేటీ అయిన ఆర్మీ చీఫ్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆర్మీ చీఫ్ బిక్రమ్ సింగ్ సమావేశమయ్యారు. దేశ భద్రత, సైన్యం ముందున్న సమస్యలు తదితర అంశాలపై వారు చర్చించారు. అంతేకాకుండా, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో భారత జవాను మృతి చెందిన అంశం కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.