: శాసనసభకు క్షమాపణలు చెప్పిన టీవీ9
టీ.ఎమ్మెల్యేలను పాచికల్లు తాగిన మొహాలంటూ టీవీ9 ప్రసారం చేసిందని ఈ రోజు శాసనసభలో టీ.సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఆంధ్రా మీడియా అహంకారాన్ని సహించమని... కేబుల్ టీవీ చట్టాన్ని ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుంటుందని హెచ్చరించారు. దీనిపై టీవీ9 యాజమాన్యం స్పందించింది. తాము ప్రసారం చేసే 'బుల్లెట్ న్యూస్' కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు రావడంపై చింతిస్తున్నామని టీవీ9 ఎడిటర్ తెలిపారు. ఈ వ్యాఖ్యలపై టీవీ9 క్షమాపణలు చెబుతోందని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావని హామీ ఇచ్చారు. జరిగిన ఘటనకు సంబంధించి శాసనసభకు క్షమాపణలు చెబుతున్నామని అన్నారు.