: టీ.నేతలను అవమానపరిచిన మీడియాపై ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలి: జీవన్ రెడ్డి
కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియాపై మండిపడ్డారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఎమ్మెల్యేలతో పాటు శాసనసభను అవమానించిన మీడియాపై ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలను కించపరిచేలా కథనాలను ప్రసారం చేసిన మీడియాపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.