: రంజాన్, మహంకాళీ జాతరపై ప్రత్యేక దృష్టి పెడతా: కేసీఆర్


రంజాన్, మహంకాళీ జాతరపై ప్రత్యేకంగా దృష్టి పెడతానని, రంజాన్ ఏర్పాట్లపై 15, 16 తేదీల్లో సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ... త్వరలో హైదరాబాదు పాతబస్తీలో పర్యటిస్తానని, పాతబస్తీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని ఆయన చెప్పారు. హైదరాబాదులో యుద్ధ ప్రాతిపదికన డ్రైనేజీ పూడికతీత పనులు చేపడతామన్నారు. మెట్రో నిర్మాణం అశాస్త్రీయంగా ఉందన్న కేసీఆర్... అసెంబ్లీ ఎదుట మెట్రో భూగర్భంలో వెళ్లేలా మార్పులు చేయాలని ఎల్ అండ్ టి కంపెనీకి చెప్పామన్నారు. సుల్తాన్ బజార్ ధ్వంసం కాకుండా మెట్రో అలైన్ మెంట్ లో మార్పు చేయాలని తాను ఆ కంపెనీకి సూచించాననన్నారు. మెట్రో రైలు వల్ల చారిత్రక భవనాలు శిథిలం కాకుండా చూస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News