: ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం కష్టం: వీహెచ్


తమిళనాడు ప్రభుత్వం తరహాలో ముస్లిం, మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తామంటూ తెలంగాణ అసెంబ్లీలో నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తప్పుబట్టారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం కష్టమన్నారు. అలాగే బీసీల కోటాకు గండికోడితే ఊరుకోమని హెచ్చరించారు. అవినీతిని నిర్మూలిస్తామంటున్న ప్రభుత్వాలు ముందు అసైన్డ్, వక్ఫ్ భూములు తీసుకున్న వారి పేర్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అటు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిపై మండిపడ్డ వీహెచ్, ఆయన ఆంధ్రప్రదేశ్ కు మంత్రిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అసలు పోలవరం పంచాయతీ పెట్టిందే వెంకయ్య అని అన్నారు.

  • Loading...

More Telugu News