: ఆసుపత్రిపై హైకోర్టు ఆగ్రహం...పేషంట్ కు ఊరట


వేలకి వేల రూపాయలను బిల్లుల రూపంలో పేర్చేసి, చివరి పైసా కట్టేదాకా పేషెంట్ ను వదిలేది లేదని భయపెట్టే ఆసుపత్రిపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే అక్రమంగా నిర్బంధించి ఉంచిన పేషెంట్ ను విడుదల చేయించమని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే... ముంబయ్ కి చెందిన సంజయ్ ప్రజాపతి తన తమ్ముడి తలకు దెబ్బ తగిలితే ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్చాడు.

ట్రీట్ మెంట్ సరిగ్గా జరగడం లేదని అతనికి అనుమానం వచ్చింది. దాంతో వేరే ఆసుపత్రికి మార్చేందుకు ప్రయత్నించాడు ప్రజాపతి. దీంతో ఆసుపత్రి అధికారులు రూ. 4.56 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయన రూ. 2.76 లక్షలు మాత్రమె చెల్లించాడు. మిగతా బ్యాలెన్స్ విషయంలో తనకు అభ్యంతరాలున్నాయని ఆసుపత్రి యాజమాన్యానికి తెలిపాడు. మొత్తం బిల్లు చెల్లిస్తేనే తప్ప పేషంట్ ను డిశ్చార్జి చేసేది లేదని ఆసుపత్రి యాజమాన్యం స్పష్టం చేసింది.

దీంతో ఏం చేయాలో పాలు పోని ప్రజాపతి కోర్టును ఆశ్రయించాడు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన హైకోర్టు ఆసుపత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పేషంట్లను అక్రమంగా నిర్బంధించడానికి వీల్లేదని తెలిపింది. అది అమానుషమని, మరోసారి పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని మందలించింది. తక్షణమే పేషంట్ ను విడుదల చేసేలా చూడమని న్యాయస్థానం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News